భార్య నల్లగా ఉందని ఆ భర్త ఏం చేశాడంటే... 

భార్య నల్లగా ఉందని ఆ భర్త ఏం చేశాడంటే... 

భార్య భర్తల మధ్య ఉండాల్సింది అనురాగం, ఆప్యాయత, ప్రేమ.  ఇవి ఉంటె రంగుతో అవసరం లేదు.  మంచి మనసుంటే చాలు... వారి కాపురం కలకలం నిలిచి ఉంటుంది.  పెళ్ళైనప్పటి నుంచి ఏదొక వంకతో గొడవకు దిగితే అలాంటి వారు ఎక్కువ రోజులు కలిసి జీవించలేరు.  హైదరాబాద్ లోని మియాపూర్ కు చెందిన యోగి అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం తన మేనకోడలతో వివాహం జరిగింది.  వివాహం తరువాత అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది.  20 రోజుల క్రితమే తిరిగి భర్త దగ్గరకు వచ్చింది.  భార్య నల్లగా ఉందని వేధించడం మొదలుపెట్టాడు.  అక్కడితో ఆగకుండా భార్యను చంపేశాడు.  ఆమెను చంపి తాను గొంతుకోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు.  ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  నల్లగా ఉందనే కారణంగానే హత్య చేశాడా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.