దారుణం: ఆన్లైన్ లో భార్యను అమ్మకానికి పెట్టిన భర్త...

దారుణం: ఆన్లైన్ లో భార్యను అమ్మకానికి పెట్టిన భర్త...

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ భర్త తన భార్యను ఆన్లైన్ అమ్మకానికి పెట్టారు.  గంటల చొప్పున పంపిస్తామని చెప్పి ఫోటోలు అప్లోడ్ చేశారు.  ఈ విషయం భార్యకు తెలియడంతో ఆందోళన చేసింది.  ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగింది.  ఆగష్టు 23 వ తేదీన తిరుపతికి చెందిన రేవంత్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.  వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో బెంగళూరు వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నారు.  పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తరువాత భార్యను హింసించడం మొదలుపెట్టాడు.  అదనపు కట్నం కావాలని హింసించడం మొదలుపెట్టాడు.  కాగా, భర్త చిత్రహింసలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్ళింది.  భర్త గురించి కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదని భార్య వాపోయింది.  అదే సమయంలో భార్య ఫోటోలు ఆన్లైన్ లో పోస్ట్ కావడంతో ఆమె షాక్ అయ్యింది.  నిలదీసేందుకు భర్త రేవంత్ ఇంటికి వెళ్లగా  రేవంత్, కుటుంబ సభ్యులు ఇంటినుంచి పారిపోయారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.