భార్య కోసం ఏనుగును కొన్న భర్త... కలలోకి వచ్చిందని...!!

భార్య కోసం ఏనుగును కొన్న భర్త... కలలోకి వచ్చిందని...!!

భార్య అంటే అందరికి ఇష్టం ఉంటుంది.  భార్య కోరిన కోరికలు నెరవేర్చాల్సిన బాధ్యత భర్తదే.  అయితే, కోరిన అన్ని రకాల కోరికలు తీర్చిడం అంటే ఎవరికీ సాధ్యం కాదు.  కానీ, బాంగ్లాదేశ్ కు చెందిన దులాల్ చంద్ర రాయ్ అనే వ్యక్తి తన భార్య కలలో వచ్చిన కోరికలు నెరవేర్చాలని సంకల్పించుకున్నాడు.  ఆమె కలలోకి వచ్చిన జంతువులను ఎంత  కష్టమైనా తీసుకొచ్చి ఇస్తున్నాడు.  సంవత్సరం క్రితం ఆమె కలలోకి ఓ ఏనుగు వచ్చింది.  దీంతో ఆ భర్త ఏనుగును కొనుగోలు చేయాలని అనుకున్నాడు.  డబ్బుకోసం చాలా ప్రయత్నాలు చేశాడు.  సమయానికి డబ్బు దొరక్కపోవడంతో, తనకున్న భూమిలో కొంతభాగాన్ని అమ్మడంతో రూ.16.5 లక్షలు వచ్చాయి.  మౌల్వీ బజార్ కు వెళ్లి ఏనుగును కొనుగోలు చేశాడు.  దానిని ఇంటికి తీసుకురావడమే కాకుండా, దానికోసం రూ.15 వేల రూపాయలతో ఓ మావటివాడిని కూడా ఏర్పాటు చేశారు.  భార్య కలలోకి వచ్చిన జంతువులను కొనుగోలు చేసి ఇస్తున్న ఆ భర్తను చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.  ఇప్పటికే ఆ భర్త గుర్రం, మేక, హంస వంటివి కొని ఇచ్చాడు. ఇప్పుడు ఏనుగు కూడా కొన్నాడు.  రేపు భార్య కలలోకి పులి, సింహం వస్తే వాటిని కూడా కొనుగోలు చేసి ఇస్తాడా అంటే ఇస్తానని అంటున్నాడు దులాల్ చంద్ర రాయ్.