భార్యకు రెండో పెళ్లి.. అడ్డుకున్న భర్త

భార్యకు రెండో పెళ్లి.. అడ్డుకున్న భర్త

తన భార్యకు రెండో పెళ్లి చేస్తున్నారంటూ ఓ యువకుడు పీటల మీద పెళ్లిని ఆపు చేశాడు. ఎత్తుకెళ్లి ఇష్టంలేకుండానే వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని ఆరోపించడంతో యువతి తరుపు బంధువులు దాడికి దిగారు. న్యాయస్థానం ఇచ్చిన సెర్చ్ వారెంట్ తో అక్కడికి రావడంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌కు చెందిన సంజీవ్‌ అనే యువకుడు ఎస్‌ఐ చంద్రభాను కుమార్తె మాధవి సంవత్సరం క్రితం హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులకే యువతి తండ్రి ఆమెను ఆదిలాబాద్ తీసుకువచ్చాడు. దీంతో సంజీవ్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ కోర్టు ను ఆశ్రయించాడు. దీంతో అతను కోర్టు నుంచి సెర్చ్‌ వారెంట్‌ పొందాడు. ఆదివారం మాధవికి మరో వివాహం జరుగుతోందని తెలుసుకున్న సంజీవ్‌ సెర్చ్‌ వారెంట్‌తో వివాహ వేడుక జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నాడు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పెళ్లి కూతుర్ని అక్కడినుంచి మాయం చేశారు. వారి రాక కోసం సంజీవ్‌తో పాటు అడ్వకేట్ కమీషనర్‌ రంజిత, ధన్‌రాజ్‌, న్యాయవాది సలీంలు ఎదురు చూస్తుండగా యువతి బంధువులు దాడి చేశారు. దీంతో ఆ యువకుడు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగాడు.