భార్య పుట్టింటికి వెళ్లి రాలేదని భర్త ఆత్మహత్యయత్నం...

భార్య పుట్టింటికి వెళ్లి రాలేదని భర్త ఆత్మహత్యయత్నం...

కరీంనగర్ జిల్లా లో భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యయత్నం చేసాడు. బెజ్జంకి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా ఆ భార్య, భర్తల మధ్య చిన్నపాటి వివాదం జరుగుతుంది. దాంతో పుట్టింటికి వెళ్లిన భార్య ఉమ తిరిగి రాలేదు. ఆ కారణంగా మనస్తాపం చెందిన భర్త కిరణ్ ఇంట్లో తలుపులు వేసుకుని సిలిండర్ కు నిప్పటించి ఆత్మహత్యయత్నం చేసాడు. కానీ చుట్టుపక్కల స్థానికులు దీనిని గమనించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి కిరణ్ ను తరలించారు. తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.