నేడే హుజూర్‌నగర్ ఉపఎన్నిక...సర్వం సిద్ధం

నేడే హుజూర్‌నగర్ ఉపఎన్నిక...సర్వం సిద్ధం

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. పోటీలో 28 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, ప్రధానంగా అధికార పార్టీ, విపక్ష కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. మొత్తం రెండు లక్షల 36వేల మంది ఓటర్లు తమ ఎమ్మెల్యే ఎవరో ఎన్నుకోనున్నారు. ఉపఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం7 గంటల నుండి సాయింత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. నియోజకవర్గంలో మొత్తం 2,36,842 మంది ఓటర్లున్నారు.

302 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అధికారులు. నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలున్నాయి. నేరేడుచర్ల  మండలంలో మొత్తం ఓటర్లు 34,087లకు గాను 43 పోలింగ్ కేంద్రాలు..పాలకీడు మండలంలో 19,639 ఓటర్ల కోసం 25 పోలింగ్ కేంద్రాలు మఠంపల్లి మండలంలో 34,855 ఓటర్లు ఉండగా 43 పోలింగ్ కేంద్రాలు మేళ్ళచెరువు మండలంలో 31,270 ఓటర్ల కోసం 41 పోలింగ్ కేంద్రాలు. చింతల పాలెం మండలంలో 25,228 మంది ఓటర్లకు 36 పోలింగ్ కేంద్రాలు హుజూర్ నగర్ మండలంలో47,886 మంది ఓటర్లు ఉండగా 57 పోలింగ్ కేంద్రాలు గరిడేపల్లి మండలంలో 43,877 మంది ఓటర్లకు 57 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1500 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

967 ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్లు సిద్ధం చేశారు. వీవీప్యాట్లు 378 అందుబాటులో ఉంచారు ఎన్నికల అధికారులు.  హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 79 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు పోలీసులు. ఈ సెంటర్లలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల్లో 2  ప్లాటూన్లతో భద్రత ఏర్పాటు చేస్తే ఉప ఎన్నిక కోఓసం అదనంగా ఐదు ప్లాటూన్లను దించారు.  అన్ని పోలింగ్‌ కేంద్రాల దగ్గరా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈవీఎంలు మొరాయిస్తే రిపేర్‌ చేయడానికి 20 మంది ఇంజనీర్లు కూడా అందుబాటులో ఉంటారు.