పాక్ కు చిక్కిన ఫైలట్ పై అసద్ ట్వీట్

పాక్ కు చిక్కిన ఫైలట్ పై అసద్ ట్వీట్

పాకిస్తాన్ చేతికి బందీగా చిక్కిన ఐఏఎఫ్‌ షైలట్ విక్రమ్ అభినందన్ పరిస్థితిపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేసారు. ఆవర్ ప్రేయర్స్ ఆర్ విత్ యూ అంటూ ట్వీట్ చేసిన అసద్,  ఈ క్లిష్టకాలంలో దేశ రక్షణ కోసం అసమాన ధైర్య సాహాసాలు ప్రదర్శిస్తున్న ఐఏఎఫ్ ఫైలెట్, వారి కుటుంబ సభ్యుల తరుపున తమ ప్రార్ధనలు ఉంటాయని అసద్ అన్నారు. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ త్రీ ప్రకారం  అందరూ బందీల పట్ల మానవతాధృక్పధంతో వ్యహరించాలని ఉందని అసద్ గుర్తు చేసారు.  పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అదే ధృక్పదంతో వ్యవహారించి తమ ఆధీనంలో ఉన్న ఐఏఎఫ్ ఫైలెట్ ను విడిచిపెట్టాలని కోరారు.