తెరుచుకోనున్న హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్... 

తెరుచుకోనున్న హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్... 

హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం గత కొన్ని రోజులుగా మూతపడిన సంగతి తెలిసిందే.  కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తలో భాగంగా ఈ కార్యాలయాన్ని మూసేశారు.  హైదరాబాద్ లో కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.  దీంతో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాన్ని తిరిగి తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.  సోమవారం నుంచి సేవలు ప్రారంభం కాబోతున్నాయి.  మహమ్మారి స్టూడెంట్ వీసా, ఉద్యోగ వీసాల సేవలు సోమవారం నుంచే అందుబాటులో ఉంటాయని కాన్సులేట్ కార్యాలయం ప్రకటించింది.