రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్.. రాత్రికి ఆస్పత్రిలోనే..

రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్.. రాత్రికి ఆస్పత్రిలోనే..

హైదరాబాద్‌కు సినిమా షూటింగ్ కోసం వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురై జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. కాసేపటి క్రితమే రజనీకాంత్ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి వైద్యులు.. ప్రస్తుతం బీపీని కంట్రోల్ చేసేందుకు వైద్యం అందిస్తున్నామని బులెటిన్‌లో పేర్కొన్న వైద్యులు.. అవసరమైన మందులు వాడుతున్నట్టు వెల్లడించారు.. ఇక, ఈ రోజు రాత్రి కూడా రజనీకాంత్ ఆస్పత్రిలోనే ఉంటారని ప్రకటించారు. రేపు రజనీకి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని... ప్రస్తుతం రజని ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. మరోవైపు.. రజనీకాంత్ కోసం ఎవరూ ఆస్పత్రికి రావొద్దు అని బులెటిన్‌లో విజ్ఞప్తి చేశారు వైద్యులు. కాగా..  అన్నాత్తై షూటింగ్ కోసం రజనీ.. హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే, కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ రావడంతో.. క్వారంటైన్‌ ఉన్నారు. ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది. కానీ, ఇవాళ ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు.