హైదరాబాద్ లో బయటపడ్డ షూ కంపెనీ మోసం...

హైదరాబాద్ లో బయటపడ్డ షూ కంపెనీ మోసం...

హైదరాబాద్ లో ఓ షూ కంపెనీ మోసం బయటపడింది. షూ కంపెనీ డైరెక్టర్ సహా పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ సుంకర, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, పుడిపెద్ద సత్యమూర్తి పై కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ కంపెనీ ఇప్పటివరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 107 కోట్ల రుణం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ లో కంపెనీ పెట్టుబడులు పెడతామని బ్యాంకులో రుణం తీసుకున్న ఈ కంపెనీ ఆ రుణాన్ని పక్కదారి పట్టించినట్లు అభియోగాలు రావడంతో సీబీఐ దాని పై కేసు నమోదుచేసి విచారణ కోసం ఆదేశాలు జారీచేసింది.