హవాలా డబ్బు.. 90 లక్షలు సీజ్

హవాలా డబ్బు.. 90 లక్షలు సీజ్

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో హవాలా నిర్వహిస్తున్న ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని 90 లక్షల 50 వేలు నగదును సీజ్ చేశారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా కాచిగూడ, సుల్తాన్‌ బజార్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. జాకెట్ లో డబ్బులు పెట్టుకుని నలుగురు హవాలా వ్యాపారులు పట్టుపడ్డారు. లెక్క చూపని డబ్బు ఉన్నట్లు గుర్తించి నలుగురిని అరెస్ట్ చేసి 90 లక్షల 50 వేలు సీజ్ చేశారు. హవాలా వ్యాపారులు దేవేశ్ కొఠారి, భక్తి ప్రజాపతి, నసీం, జైన్ లుగా పోలీసులు గుర్తించారు. 'ఎలక్షన్ కమిషన్ గైడెలెన్స్ ప్రకారం ఆన్ అకౌంట్ మనీని సీజ్ చేసాం. తదుపరి విచారణకు ఆదాయ పన్ను శాఖకి అప్పగిస్తాం' అని సీపీ అంజనీకుమార్ తెలిపారు.