సైబర్ క్రైం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు

సైబర్ క్రైం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు

సైబర్‌ క్రైమ్‌ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ ఏడాది లక్ష్యాలపై పోలీసులకు అంజనీ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తామన్నారు. ఎస్ ఐలకు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రత్యేక శిక్ష ఇస్తామని సీపీ తెలిపారు.