పోలీస్ వర్సెస్ సెలబ్రిటీ

పోలీస్ వర్సెస్ సెలబ్రిటీ

గత రెండు నెలలుగా నగరంలో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో క్రికెట్ మ్యాచులను హైదరాబాద్ క్రికెట్ లీగ్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ లీగ్ లో విజేతగా నిలిచిన టీం, సెలెబ్రిటీ జట్టుతో ఒక మ్యాచ్ ఆడనుంది. అందుకు సంబంధించి ఓ టీజర్ ను సీపీ అంజనీ కుమార్ రిలీజ్ చేశారు. రేపు ఈ మ్యాచ్ ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ను చూడటానికి ఎలాంటి రుసుము లేకుండా ఎవరైనా వెళ్లే అవకాశాన్ని పోలీసులు కల్పించారు. 

ఇంతవరకు జరిగిన లీగ్ లో 270 జట్లు పాల్గొన్నాయి. ఇందులో 4050 మంది క్రీడాకారులు పాల్గొనడం విశేషం. దీని ద్వారా దాదాపు 40 వేల సామాన్య పౌరులు మమేకమయ్యారు. రేపు జరగబోయే మ్యాచ్ కి హోమ్ మంత్రి, డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, అఖిల్, ఇతర నటులు హాజరుకానున్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాల వలన ప్రజలకు, పోలీసులకు మంది సంబంధాలు ఏర్పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.