దిశ కేసు: ఎన్‌కౌంటర్ స్పాట్‌కు మళ్లీ పోలీసులు

దిశ కేసు: ఎన్‌కౌంటర్ స్పాట్‌కు మళ్లీ పోలీసులు

దిశ కేసులోని నలుగురు నిందితులను చటాపల్లి దగ్గర తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేశారు... కస్టడీలోకి తీసుకున్న నిందితులు దిశ సెల్‌ఫోన్, వాచ్‌ దాచిన ప్రాంతాన్ని చూపిస్తామంటే.. బాధితురాలిని దహనం చేసిన స్పాట్‌కు శుక్రవారం తెల్లవారు జామునన తీసుకెళ్లారు పోలీసులు.. అయితే, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితులు.. పోలీసులపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారని.. అనంతరం వెపన్స్ లాక్కొన్ని కాల్పులకు యత్నించారని.. లొంగిపోవాలని హెచ్చరించినా వినకపోవడంతో ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక, ఇవాళ చటాపల్లి ఎన్‌కౌంటర్ స్పాట్‌లో మరోసారి తనిఖీలు చేపట్టారు పోలీసులు.. ఎన్‌కౌంటర్ సమయంలో నిందితుల శరీరం నుంచి బయటకు వెళ్లిన బుల్లెట్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే ఎన్‌కౌంటర్ స్పాట్‌లో కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకుంది బాంబ్ స్క్వాడ్. కాగా, ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాలతో ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోనే నిందితుల మృతదేహాలను ఉంచారు. ఇవాళ ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఆ మృతదేహాలను పరిశీలించనుంది. మరోవైపు ఈ నెల 9వ తేదీ వరకు ఆ నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.