అమెరికాలో దారుణం.. హైదరాబాద్‌ యువతిపై అత్యాచారం, హత్య..!

అమెరికాలో దారుణం.. హైదరాబాద్‌ యువతిపై అత్యాచారం, హత్య..!

అమెరికాలో హైదరాబాద్‌ యువతిని దారుణంగా హత్య చేశారు. 19 ఏళ్ల రూత్‌ జార్జ్‌పై అత్యాచారం చేసి చంపేసినట్లు అక్కడి పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 22న ఈ ఘటన జరిగింది. యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌లో చదువుకుంటోంది రూత్‌ జార్జ్‌. డొనాల్‌ తుర్మాన్‌ అనే మృగాడు ఈ ఘాతుకానికి పాల్పడి.. యూనివర్సిటీ గ్యారేజీలో రూత్‌ మృతదేహాన్ని పడేశాడు. నిందితుడిని చికాగోలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతనిపై హత్య, లైంగిక వేధింపుల కేసు పెట్టారు. మరోవైపు- తమ అమ్మాయి కనిపించడం లేదని యూనివర్సిటీ పోలీసులకు రూత్‌ పేరెంట్స్‌ ఫిర్యాదు చేశారు. దాంతో యూనివర్సిటీ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులకు డొనాల్డ్‌ దుశ్చర్య కనిపించింది. త‌న కారులోనే యువ‌తి శ‌వ‌మై క‌నిపించింది. ఈ హ‌త్య కేసులో 26 ఏళ్ల డోనాల్డ్ తుర్‌మాన్‌ను దోషిగా తేల్చారు. నిందితుడిపై ఫ‌స్ట్ డిగ్రీ మ‌ర్డ‌ర్ కేసును న‌మోదు చేశారు. లైంగిక‌దాడి కింద కూడా కేసును బుక్ చేశారు. వెంటనే రూత్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. నిందితుడి కోసం గాలించారు. అతడిని ఎట్టకేలకు చికాగోలో పట్టుకున్నారు. రూత్‌ కుటుంబం హైదరాబాద్‌ నుంచి అమెరికా వెల్లి ఇల్లినాయిస్‌లో స్థిరపడింది.