హైలాండ్ విలువ రూ. 550 కోట్లు...

హైలాండ్ విలువ రూ. 550 కోట్లు...

హైకోర్టులో మరోసారి అగ్రిగోల్డ్ కేసులో విచారణ జరిగింది... హైలాండ్ విలువను రూ. 550 కోట్లుగా నిర్ణయించింది హైకోర్టు... అయితే 2022 వరకు గడువు ఇస్తే రూ. 8.500 కోట్లు చెల్లించడానికి తాము సిద్ధమని హైకోర్టుకు తెలిపింది అగ్రిగోల్డ్ యాజమాన్యం... దీనిపై హైకోర్టు స్పందిస్తూ... ఆ ప్రతి పాదనను తోసిపుచ్చింది. విజయవాడలో ఉన్న కార్పొరేట్ ఆఫీస్ భవనాన్ని విక్రయించగా వచ్చిన రూ.11 కోట్లను కోర్టులో డిపాజిట్ చేవారు కొనుగోలుదారులు... ఏపీలో ఉన్న 83 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను షీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించింది సీఐడీ... మరోవైపు తెలంగాణలోని 195 అగ్రిగోల్డ్ అస్తుల విలువను కోర్టుకు సమర్పించింది తెలంగాణ సీఐడీ. తదుపరి విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.