బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో  సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.   హఫీజ్ పేట్ లో ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి భూములు కొనుగోలు చేసారని...భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నితుడిగా ప్రవీణ్ రావ్ తండ్రి కిషన్ రావ్ ఉన్నాడని పోలీసుల విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. భూమా బతికి ఉన్న సమయంలో... భూమాకి కీలకంగా కిషన్ రావ్ వ్యవహరించాడని... భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ల్యాండ్ విషయంలో రంగంలోకి ఏవీ సుబ్బా రెడ్డి దిగాడని పోలీసులు గుర్తించారు.  ఏవీ ఎస్టేట్స్ పేరుతో ల్యాండ్ లోకి ప్రవేశించిన ఏవీ సుబ్బా రెడ్డి... 2020 లో ఏవీ సుబ్బా రెడ్డి పై కెపి ఎస్టేట్స్ ఓనర్ ప్రవీణ్ రావ్ ట్రెస్ పాస్ కేసు పెట్టాడు.   గతంలోనే 50 ఎకరాల భూమిలో చెరో 25 ఎకరాల ల్యాండ్ చెందేట్లు ఏవీ సుబ్బా రెడ్డి మధ్యవర్తిత్వం చేశాడు.  ఏవీ సుబ్బా రెడ్డితో గతంలోనే సెటిల్మెంట్ చేసుకున్నాడు ప్రవీణ్ రావ్. అయితే.. మిగతా 25 ఎకరాలు కూడా తమకే కావాలని ప్రవీణ్ రావ్ పై భూమా కుటుంబ సభ్యుల ఒత్తిడి పెంచినట్లు విచారణలో తేలింది. భార్గవ్ అఖిల కుటుంబ సభ్యుల పక్కా ప్లాన్ తోనే భూమా ఫ్యామిలి కిడ్నాప్ కు  పాల్పడింది.