హైదరాబాద్ లాక్ డౌన్ : ఆరోజు నుండే ?

హైదరాబాద్ లాక్ డౌన్ : ఆరోజు నుండే ?


హైదరాబాద్‌లో మరో సారి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు నిన్నటి నుండి చర్చ జరుగుతోంది. స్వయానా ముఖ్యమంత్రే ఈ ఆలోచన చేయడంతో అందరూ లాక్ డౌన్ ఉండనుందని ఫిక్స్ అయిపోయారు. మరో మూడు నాలుగు రోజుల్లో దానికి సంబందించిన నిర్ణయం తీసుకుంటామని నిన్న సీఎం పేషీ నుండి సమాచారం కూడా వచ్చింది. ఇక ఈరోజు కూడా మంత్రి ఈటెల మాట్లాడుతూ హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించే విషయం మీద కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. లాక్‌ డౌన్‌ ఏ విధంగా విధించాలి అన్నదానిపై రెండుమూడు రోజుల్లో కేబినెట్‌ సమావేశం నిర్వహించి నిర్ణయిస్తామని చెప్పారు.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హైదరాబాద్ లో పదిహేను రోజుల లాక్ డౌన్ విధించనున్నారట. అది కూడా లాక్ డౌన్ జూలై మూడు నుండి మొదలవ్వచ్చని అంటున్నారు. అయితే ఈసారి మునుపటి కంటే కఠినంగా లాక్ డౌన్ అమలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగం సిద్దం అవ్వమని ఆదేశాలు అందినట్టు చెబుతున్నారు. ఇక ఇదే విషయాన్ని జూలై 2న కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాల మీద అధికారిక ప్రకటన కేసీఆర్ ప్రెస్ మీట్ లోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది.