ముగిసిన స‌న్‌రైజ‌ర్స్ బ్యాటింగ్..

ముగిసిన స‌న్‌రైజ‌ర్స్ బ్యాటింగ్..

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటింగ్ ముగిసింది.. షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జ‌రుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది..  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ప్ప‌టికీ.. మ‌నీష్ పాండ్యా, వార్న‌ర్, సా‌హా త‌ప్ప ఎవ‌రూ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు.. మ‌నీష్ పాండ్యా 51 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకోగా.. వార్నర్ 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక‌, సాహా 30 పరుగులు చేశాడు.. మొత్తానికి 20 ఓవ‌ర్ల‌లో 142 ప‌రుగులు చేసి కోల్‌క‌తా ముందు 143 ప‌రుగుల టార్గెట్ పెట్టింది స‌న్ రైజ‌ర్స్‌. గ‌తంలో త‌క్కువ స్కోర్లు చేసి ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేసి విజ‌యం సాధించిన హైద‌రాబాద్ జ‌ట్టు.. మ‌రి ఈ మ్యాచ్‌లో ఏం చేస్తుందో చూడాలి.