ప్రారంభమైన మారథాన్, ట్రాఫిక్ ఆంక్షలు...

ప్రారంభమైన మారథాన్, ట్రాఫిక్ ఆంక్షలు...

మారథాన్ రన్‌ సందర్భంగా పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 42 కిలోమీటర్ల మేర మారథాన్ రన్ జరిగే రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 26కి దేశాల ప్రతినిధులు ఈ రన్‌లో పాల్గొంటుండగా.... 5కే, 10కే, 21కే, 42కే విభాగాల్లో రన్‌ నిర్వహిస్తున్నారు. ఈ రన్‌లో 7,500 మందికి పైగా పాల్గొంటున్నారు. నెక్లెస్ రోడ్డులో ప్రారంభమైన హైదరాబాద్ మారథాన్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ప్రారంభించగా... మారథాన్‌లో చిన్నాపెద్ద తేడాలేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్‌ నుంచి గచ్చిబౌలి వరకు మారథాన్ జరిగే రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.