హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డు.. ఆ మార్క్‌ కూడా దాటేసింది..

హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డు.. ఆ మార్క్‌ కూడా దాటేసింది..

ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది.. మరోవైపు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది హైదరాబాద్‌ మెట్రో రైల్.. టీఎస్ ఆర్టీసీ సమ్మె 18వ రోజుకు చేరగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. దీంతో మెట్రోను ఆశ్రయిస్తున్నారు హైదరాబాదీలు. సొంత వాహనాల కంటే మెట్రోలో వెళ్తే ఖర్చు తక్కువగా ఉండడం, ట్రాఫిక్ లేకుండా సమయం కూడా కలిసి వస్తుండడం కూడా కారణంగా చెబుతున్నారు. అయితే, ఆర్టీసీ సమ్మెను మెట్రో సొమ్ము చేసుకుంటుంది.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లతో పాటు.. ట్రిప్పులు కూడా పెంచేసింది.. దీంతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు 4 లక్షల మందిని గమ్యస్థానాలను చేర్చిన హైదరాబాద్ మెట్రో.. సోమవారం 4 లక్షల మార్క్‌ను కూడా దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. సోమవారం 4 లక్షల ప్రయాణికుల మార్క్‌ను దాటేశామని.. నాలుగు అదనపు రైళ్లతో పాటు.. రోజుకు 830 ట్రీప్పులు నడుస్తున్నట్టు వెల్లడించారు.