నేడు రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు

నేడు రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు

ఆదివారం హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మెగా ఫైనల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై, మాజీ విజేత ముంబయి తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఐపీఎల్‌లో ఎనిమిదోసారి ఫైనల్లో అడుగుపెట్టిన చెన్నైకి మరోసారి ముంబయి ప్రత్యర్థిగా నిలిచింది. ఈ ఆసక్తికర పోరు కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్ చైన్నైలో జరగాలసి ఉండగా చివరి నిమిషంలో హైదరాబాద్ కు మార్చారు. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపధ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్లను అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడపాలని మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.