నకిలీ ఐపీఎస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

నకిలీ ఐపీఎస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

ఓ నకిలీ ఐపీఎస్‌ను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్‌ఐఏ అదనపు ఎస్పీ అని చెప్పుకొంటూ మోసాలకు పాల్పడుతున్న ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గురువినోద్‌ ను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. నిందితుడి నుంచి నకిలీ తుపాకీ, ల్యాప్‌ట్యాప్‌, ఎన్‌ఐఏ సహా వివిధ సంస్థల రబ్బరు స్టాంపులు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు గతంలోనూ నకిలీ గుర్తింపు కార్డులతో కొందరిని బెదిరించి జైలుకు వెళ్లాడని.. జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ బెదిరింపులు, మోసాలకు పాల్పడ్డాడని సీపీ తెలిపారు.