బందిపోటు దొంగల అరెస్ట్..

బందిపోటు దొంగల అరెస్ట్..

బందిపోటు దొంగల ముఠాకు చెందిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్‌ పోలీసులు. బందిపోటు దొంగల ముఠాలో కీలక నిందితులుగా ఉన్న మొహమ్మద్ నిజాముద్దీన్, ఆసీఫ్, ఖాలీద్, జావిద్‌ను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 11 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అజర్ అనే వ్యక్తి దగ్గర నుండి ఈ ముఠా సిల్వర్ ఆభరణాలను దోపిడీ చేసినట్టుగా గుర్తించారు. బాధితుడు అజర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు శాలిబండ పోలీసులు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. గతంలో కూడా నిందితులు అనేక నేరాలకు పాల్పడినట్లు సీపీ అంజనీ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.