హత్య చేసి ఫ్రిజ్‌లో కుక్కి.. మిస్టరీని ఛేదించిన జూబ్లీహిల్స్ పోలీసులు..

హత్య చేసి ఫ్రిజ్‌లో కుక్కి.. మిస్టరీని ఛేదించిన జూబ్లీహిల్స్ పోలీసులు..

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి.. గురువారం దారుణమైన ఘటన వెలుగు చూసింది.. రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 35 ఏళ్ల సాదిక్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు.. కూకట్‌పల్లిలో టైలరింగ్‌ షాపు నిర్వహిస్తున్న సాదిక్ ను హత్య చేసి.. ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి పరారయ్యారు.. దీంతో ఈ కేసు మిస్టరీగా మారిపోయింది.. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి కూపీలాగారు.. టైలర్ హత్యకేసు మిస్టరీని ఛేదించారు.. టైలర్‌ సాదిక్ ను అతని భార్య రుబీనా చంపినట్లుగా గుర్తించారు జూబ్లీహిల్స్ పోలీసులు..

కార్మికనగర్ కు చెందిన సాదిక్‌.. మొదట్లో అమీర్ పేటలో టైలర్ షాప్ నడిపించేవాడు.. అయితే, లాక్‌డౌన్ కారణంగా షాప్ మూసివేసి ఇటీవలే కూకట్‌పల్లి ప్రాంతంలో మరో షాపు ఓపెన్ చేవాడు.. కానీ, ఆర్థిక లావాదేవీల విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరిగేవని.. భార్య రూబినానే భర్తను హత్య చేసి ఫ్రిజ్‌లో పెట్టినట్టు నిర్ధారించారు పోలీసులు. భర్తను గొడవపడిన ఆమె.. హత్య చేసి.. శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటింకి వెళ్లిపోయింది.. ఆ ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఆ ఫ్లాట్ మొత్తం గాలించగా.. చివరకు ఫ్రిజ్‌లో శవాన్ని గుర్తించి షాక్ తిన్నారు. సాదిక్ భార్య రూబినాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు.