కేన్సర్ ను నయం చేసే వేప

కేన్సర్ ను నయం చేసే వేప

భారతీయ వైద్య విధానం ఆయుర్వేదంలో వేపకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆయుర్వేద శాస్త్రం వేపను చింతామణి, సర్వరోగ నివారిణి అని చెబుతోంది. వేపతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలున్నాయని ఆధునిక ఆరోగ్య నిపుణులు సైతం ఒప్పుకుంటున్నారు. అయితే వేప ప్రాణాంతక కేన్సర్ ని సైతం నయం చేయగలదంటున్నారు హైదరాబాద్ శాస్త్రవేత్తలు. వేపాకు, వేపపూవులోని నింబోలైడ్‌ అనే ఫైటో కెమికల్ కేన్సర్ తో సమర్థంగా పోరాడగలదని వారు చెబుతున్నారు.

పలు రకాల కేన్సర్లను ఎదుర్కోవడంలో నింబోలైడ్‌ అద్భుతంగా పని చేస్తుందని చాలా ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. నింబోలైడ్‌ ను నేరుగా తీసుకుంటే శరీరం దాని ఔషధ గుణాలను పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదని.. దానితో దాని ప్రభావం తగ్గినట్టు పరీక్షల్లో కనిపించింది. దీంతో అయితే దానిని ఔషధ రూపంలో తీసుకు రావడం సాధ్యం కాలేదు. హైదరాబాద్ నగరంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) పరిశోధకులు ఈ నింబోలైడ్‌ రహస్యాన్ని ఛేదించేందుకు నడుం బిగించారు.

మాత్రల రూపంలో ఇది ప్రభావాన్ని చూపకపోవడంతో వారు నింబోలైడ్‌ తో ఇంజెక్షన్ తయారు చేశారు. ఇది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. కేన్సర్ కణాలతో పోరాడి కేన్సర్‌ వ్యాప్తిని, రూపాంతరాన్ని నింబోలైడ్‌ అడ్డుకుంటోందని నైపర్ పరిశోధకులు తెలిపారు. రోగకారక కణాలపై తప్ప ఆరోగ్యవంతమైన కణాలపైన ఇది ఎలాంటి చెడు ప్రభావం చూపడం లేదని వారు వివరించారు. ముఖ్యంగా క్లోమగ్రంధి, గొంతు, ప్రొస్టేట్ కేన్సర్ లలో ఈ మందుతో మంచి ఫలితాలు కనిపించాయి.

Photo: FileShot