హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికకానుంది. అక్టోబర్‌ 11, 12 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ సదస్సు జరగనుంది. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సులో పట్టణ అవస్థాపన సమస్యలు, పరిశ్రమల డిజైన్‌పై వ్యక్తలు చర్చించనున్నారు.