జేఈఈలో సత్తాచాటిన తెలుగు కుర్రాళ్లు

జేఈఈలో సత్తాచాటిన తెలుగు కుర్రాళ్లు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తొలి 20 ర్యాంకుల్లో హైదరాబాద్‌ విద్యార్థులు ఐదు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఆకాశ్‌రెడ్డి 4వ ర్యాంకు, బి.కార్తికేయ ఐదో ర్యాంకు, ఎం.త్రివేశ్‌చంద్ర 8వ ర్యాంకు, జి.వి.కృష్ణ సూర్య లిఖిత్‌ 13వ ర్యాంకు, సూరపనేని సాయివిజ్ఞకు 44వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరిలో డి.చంద్రశేఖర్‌ మొదటి ర్యాంకు సాధించారు. దేశ వ్యాప్తంగా లక్షా 65వేల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఏపీ నుంచి 13,267 మంది విద్యార్థులు, తెలంగాణ నుంచి 16,886 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.