గణేష్‌ నిమజ్జనం.. వాహనదారులకు కీలక సూచనలు..

గణేష్‌ నిమజ్జనం.. వాహనదారులకు కీలక సూచనలు..

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది పోలీసు యంత్రాంగం.. ఈ సందర్భంగా వాహనదారులకు కీలక సూచనలు చేశారు ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్‌కుమార్... గణేష్ నిమజ్జనంలో ట్రాఫిక్ రూల్స్‌పై మీడియాతో మాట్లాడిన అడిషనల్ సీపీ... నిమజ్జనంలో పాల్గొనే వాహనదారులకు పలు హెచ్చరికలు చేశారు. నిమజ్జనాకి వచ్చే వాహనదారులకు హెల్మెట్‌ తస్పనిసరి అని స్పష్టం చేసిన అనిల్ కుమార్.. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణం చేయొద్దని హెచ్చరించారు. గత ఏడాది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఐదుగురు మృతిచెందారని గుర్తుచేసిన అడిషనల్ సీపీ అనిల్ కుమార్... వాహనదారులు హెల్మెట్ ధరించకుండా నిమజ్జనంలో తప్పించుకున్నా తర్వాత జరిమానాలు ఇంటికి పంపిస్తామన్నారు. ఇక, గణేష్ శోభాయాత్రలో బైక్‌లు, కార్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే, మెట్రోతో పాటు ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను వాడుకోవాలని సూచించారు.