అమెరికాలో తెలుగు యువకుడు మృతి

అమెరికాలో తెలుగు యువకుడు మృతి

అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. హైదరాబాద్‌ పరిధిలోని నల్లకుంట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతను కాంగ్రెస్‌ మాజీ నేత మధుసూదన్‌ కుమారుడని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.