శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి

శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి

శ్రీలంకలో ఆదివారం ఈస్టర్ రోజున జరిగిన వరుస బాంబు పేలుళ్లలో హైదరాబాద్ వాసి చనిపోయాడు. మృతుడు నగరంలోని అమీర్ పేట్ కు చెందిన తులసీరాంగా గుర్తించారు. హైదరాబాద్‌లో పైలట్‌ శిక్షణ పొందుతున్న తులసీరాం స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని రేవేంద్రపాడు. తులసీరాం మృతితో  రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. కుమారుడు మరణవార్త తెలుసుకున్న తులసీరాం తల్లి నళిని ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. వ‌రుస బాంబు పేలుళ్ల దాడిలో మృతుల సంఖ్య 321కి పెరిగింది. మొత్తం 500 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.