లండన్ లో తెలుగువ్యక్తి దారుణ హత్య

లండన్ లో తెలుగువ్యక్తి దారుణ హత్య

లండన్ లో తెలుగువ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కు చెందిన నజీముద్దీన్ అనే యువకుడు లండన్ లోని కేఫ్ లో పనిచేస్తున్నాడు. గురువారం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. గత ఆరు సంవత్సరాలుగా నజీముద్దీన్ లండన్ లో నివసిస్తున్నారు. ఆయన భార్య లండన్ లో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.