వరల్డ్ టాప్‌ 10లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్..

వరల్డ్ టాప్‌ 10లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్..

రోజుకు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో టాప్‌ 10లో చోటు దక్కించుకుంది. 2019 ఏడాదికి గాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌లను విడుదల చేసింది ఎయిర్‌హెల్ప్‌ అనే సంస్థ. ఈ జాబితాలో శంషాబాద్‌  ఎయిర్‌పోర్ట్ 8వ స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్టు ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్‌ వంటివాటిని పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది ఎయిర్‌హెల్ప్‌.. 40 దేశాల్లోని 40 వేల మంది ప్రయాణికులతో సర్వే నిర్వహించి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఖతార్‌లోని హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు టాప్‌స్పాట్‌లో నిలవగా.. జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానం, గ్రీస్‌లోని ఏథెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మూడో స్థానంలో నిలిచాయి. మరోవైపు టాప్‌ 10లో అమెరికా, యూకేలోని ఒక్క ఎయిర్‌పోర్ట్‌కు కూడా స్థానం దక్కలేదు. 

ఇక టాప్‌ 10 అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌లను పరిశీలిస్తే... 1. ఖతార్‌లోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, 2. జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం, 3. గ్రీస్‌లోని ఏథెన్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, 4. బ్రెజిల్‌లోని అఫోన్సో పెనా అంతర్జాతీయ విమానాశ్రయం, 5. పోలాండ్‌లోని గాన్స్‌ లెచ్‌ వలేసా విమానాశ్రయం, 6. రష్యాలోని షెరెమెటేవో అంతర్జాతీయ విమానాశ్రయం, 7. సింగపూర్‌లోని షాంఘి ఎయిర్‌పోర్టు సింగపూర్‌, 8. భారత్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, 9. స్పెయిన్‌లోని టెనెరిఫె నార్త్‌ విమానాశ్రయం, 10. బ్రెజిల్‌లోని కాంపినస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం.. టాప్‌ 10 జాబితాలో నిలిచాయి. ఇక ప్రపంచంలోని అత్యంత వరస్ట్ ఎయిర్‌పోర్ట్‌ల జాబితాను కూడా ప్రకటించింది ఎయిర్‌హెల్ప్‌.