13 నుంచి విద్యార్థినులకు హెల్త్ కిట్స్ పంపిణీ...

13 నుంచి విద్యార్థినులకు హెల్త్ కిట్స్ పంపిణీ...

రాజ్‌భవన్ స్కూల్ విద్యార్థినులకు గవర్నర్ సతీమణి విమలా నరసింహన్‌తో కలిసి హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందజేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ కలెక్టర్ యోగితా రాణా, డీఈవో వెంకట నరసమ్మ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విమలా నరసింహన్ మాట్లాడుతూ... బాలికలు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలని... పరిశుభ్రత పాటించాలని సూచించారు. కిట్లపై ఏవైనా అనుమానాలు ఉంటే మీ టీచర్‌ని అడగాలని విద్యార్థులకు చెప్పిన ఆమె... పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినిలకు 13వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య  హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించనున్నట్టు తెలిపారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది ఆడపిల్లలకు సంవత్సరనికి సరిపడా కిట్స్ అందిస్తున్నామన్న ఆయన... బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ఏడాదికి రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. 570 గురుకుల పాఠశాలలు, గిరిజన, దళిత విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా 53 గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటుచేశామని... విద్యార్థినిల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టె తెలిపారు. 12 నెలలకు సరిపడ కిట్లు అందజేస్తామన్నారు కడియం శ్రీహరి.