హుందాయ్ 'వెన్యూ' విడుదలైంది..

హుందాయ్ 'వెన్యూ' విడుదలైంది..

దక్షిణ కొరియాకి చెందిన కార్ల తయారీ సంస్థ హుందాయ్ సరికొత్త వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేసింది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వాహనమైన ‘వెన్యూ’ పేరుతో తీసుకొచ్చిన ఈ కారు ధర రూ.6.5లక్షల నుంచి రూ.11.1లక్షలుగా(ఎక్స్‌షోరూం ఢిల్లీ) ఉంది. మూడు రకాల ఇంజిన్స్‌ ఆప్షన్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. 1లీటర్‌ టర్బో, 1.2లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రైన్స్‌, 1.4లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో ఇది రానుంది. పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.6.5లక్షల నుంచి 11.1లక్షల మధ్య ఉండగా, డీజిల్‌తో నడిచే వాహనం ధర రూ.7.75లక్షల నుంచి 10.84లక్షల మధ్య ఉంది.