నాది ఐరన్ లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్..

నాది ఐరన్ లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్..

నన్ను ఐరన్ లెగ్ అన్న వారికి నా గెలుపే ఓ సమాధానం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా... న‌గ‌రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు రోజా.. 2681 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా... కాస్త భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న‌ను ఇప్పటి దాకా ఐరన్ లెగ్ అని.. తాను గెలిస్తే జ‌గ‌న్ అధికారంలోకి రారంటూ ప్రచారం చేసిన వారికి ఇదే హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చారు. త‌న‌ది ఐరన్ లెగ్ కాద‌ని.. గోల్డెన్ లెగ్ అన్న రోజా... బైబై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఇక ఆడవాళ్లు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు రోజా.