డిసెంబర్ 11న నేనే కింగ్ మేకర్: ఓవైసీ

డిసెంబర్ 11న నేనే కింగ్ మేకర్: ఓవైసీ

డిసెంబర్ 11న నేనే కింగ్ మేకర్ అని ఎంఐఎం పార్టీ ఆగ్ర నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడడంతో ఎంఐఎం కూడా అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతోంది. శుక్రవారం చంద్రయాన్ గుట్ట నియోయకవర్గంలోని రియసాత్ నగర్ లో ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, కేసీఆర్ ప్రతి ఒక్క సీఎంకు చెపుతున్నా.. డిసెంబర్ 11న అందరూ చూడండి ఏంజరుగుతుందో, ఆ రోజున నేనే కింగ్ మేకర్ అని అన్నారు.

అంతకుముందు కూడా హైదరాబాద్‌లో జరిగిన ఎంఐఎం కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్‌ ఓవైసి ఉద్రేకంగా మాట్లాడారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం కీలక పాత్ర నిర్వహించే అవకాశం ఏర్పడుతుందన్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు?. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినపుడు.. తెలంగాణలో మేము (ఎంఐఎం) ఎందుకు సీఎం కాలేం? అని ఓవైసీ ప్రశ్నించారు.