నేను ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం...

నేను ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం...

దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో చంపేశారు తెలంగాణ పోలీసులు... దిశను దహనం చేసిన ఘటనా స్థలానికి నిందితులను తీసుకెళ్లిన పోలీసులు.. దిశ సెల్‌ఫోన్, వాచ్‌ ఎక్కడపెట్టారో చూపించాలని కోరారు.. అవి వెతుకుతున్నట్టుగా నటించే పోలీసులపై దాడికి దిగడం, గన్‌ లాక్కొని కాల్పులకు యత్నించడంతో.. పోలీసులు వారిని కాల్చిచంపేశారు. అయితే, ఈ ఘటనపై భిన్నమైనవాదనలు వినిపిస్తున్నాయి.. ఓవైపు తెలంగాణ పోలీసులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తుండగా.. మరికొందరు ఈ ఎన్‌కౌంటర్‌ను తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. నేను ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం.. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌పై వివరణ కోరిన విషయాన్ని గుర్తుచేశారు అసదుద్దీన్ ఒవైసీ.