సల్మాన్ తో చేయనని చెప్పేసింది...

సల్మాన్ తో చేయనని చెప్పేసింది...

సల్మాన్ ఖాన్ భారత్ సినిమా విషయంలో అనేక మలుపులు తురుగుతున్నాయి . మొదట  ఈ సినిమాకు ప్రియాంక చోప్రాను హీరోయిన్ అనుకున్నారు.  కానీ, ఆమె అనూహ్యంగా తప్పుకోవడంతో చివరి నిమిషంలో కత్రినా కైఫ్ ను ఎంపిక చేశారు.  సినిమా పూర్తయింది.  జూన్ 5 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సమయంలో ఈ సినిమా గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.  

సల్మాన్ ఖాన్ కు జోడిగా కత్రినా తో ప్ ఆటు దిశా పటాని కూడా హీరోయిన్ గా చేసింది.  ఈ సినిమా తరువాత సల్మాన్ ఖాన్ తో మరో సినిమా చేయబోనని స్పష్టంగా చెప్పేసింది.  కారణం ఏంటి అనే విషయాలు మాత్రం చెప్పడం లేదు.  సల్మాన్ ఖాన్ పక్క చాలా చిన్న పిల్లలా కనిపిస్తున్నానని అందుకే ఇకపై సల్మాన్ తో సినిమా చేయనని చెప్పింది దిశా.