మోడీ బయోపిక్ లో పాట రాయలేదు...

మోడీ బయోపిక్ లో పాట రాయలేదు...

ప్రధాని మోడీ జీవిత చరిత్ర ఆధారంగా పీఎం నరేంద్ర మోడీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.  మోడీ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.  ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.  ఏప్రిల్ 5 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  

ఇదిలా ఉంటె, ఈ సినిమాలోని సాంగ్స్ ను జావేద్ అక్తర్, ప్రసూన్ జోషి, సమీర్, కుమార్ ఉపాధ్యాయ్, సర్దారా తదితరులు రాసినట్టుగా టైటిల్ కార్ట్ లో చూపించారు. ఇప్పుడు ఈ టైటిల్ కార్డు వివాదంగా మారింది.  పీఎం నరేంద్ర మోడీ సినిమాలో తాను ఎలాంటి పాటను రాయలేదని ప్రముఖ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.  సాంగ్ రాయకపోయినా తన పేరు లిరిక్స్ లిస్ట్ లో చూసి షాక్ అయ్యాయని జావేద్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.  మరి దీనిపై పీఎం నరేంద్ర మోడీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.