జేసీ సంచ‌ల‌నం.. వైసీపీలో చేరేందుకు సిద్ధం..!

జేసీ సంచ‌ల‌నం.. వైసీపీలో చేరేందుకు సిద్ధం..!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు.. జేసీ ఫ్యామిలీ మొత్తం వైసీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంద‌నే ప్ర‌చారం ఓవైపు సాగుతోన్న స‌మ‌యంలో.. వాటిపై స్పందిచిన ఆయ‌న‌.. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.. అయితే ఓ ష‌ర‌తు కూడా పెట్టారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా రెడీ అన్నారు. సీఎం జ‌గ‌న్ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే ఉంచితే.. ఆయ‌న‌కు కండువా క‌ప్పి గ‌జ‌మాల‌తో స‌త్క‌రిస్తాన‌ని ప్ర‌క‌టించారు. త‌న కుమారుడితో క‌లిసి 54 రోజుల జైలు జీవితం గ‌డిపి.. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌పై విడుద‌లైన జేసీ ప్ర‌భాక‌ర్.. తాను ఇప్పుడు తాడిపత్రి ప్రజల్లో నూతనోత్సాహం చూశానని, గతంలో ఎప్పుడూ ఇంటి నుంచి బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి హార‌త‌లు ఇచ్చార‌ని వ్యాఖ్యానించారు.