దీదీ దుర్బాషలే తనకు దీవెనలు

దీదీ దుర్బాషలే తనకు దీవెనలు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం పశ్చిమబెంగాల్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. తనను దేశ ప్రధానిగా అంగీకరించనని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. దీదీ తనను దేశ ప్రధానిగా అంగీకరించనని బాహాటంగా చెబుతున్నారని అయితే ఆమె పాకిస్తాన్‌ ప్రధానిని మాత్రం గుర్తిస్తారని చురకలు వేశారు. రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి చాలా అహంకారం ఉంద‌ని మోదీ అన్నారు. ప్ర‌ధానితో మాట్లాడేందుకు ఆమె నిరాక‌రిస్తున్న‌దంటే, అమె ప‌త‌నం ప్రారంభ‌మైన‌ట్లే అని మోడీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళనతో ఆమె రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫొని తుపాన్‌ ప్రభావంపై తాను బెంగాల్‌ సీఎంతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె నుంచి సమాధానం లేదని చెప్పుకొచ్చారు. బెంగాల్‌కు మేలు చేయడం పట్ల ఆమెకు ఆసక్తి లేదని ఆరోపించారు. దీదీ దుర్బాషలే తనకు దీవెనలుగా పనిచేస్తాయని అన్నారు.