జగన్ కు డీఎంకే అధినేత శుభాకాంక్షలు

జగన్ కు డీఎంకే అధినేత శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన సందర్భంగా పలువురు నాయకులు జగన్ కు అభినందనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని, ఉపరాష్ట్రపతి, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు శుభాభినందనలు తెలిపారు. తాజాగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మొదటిసారి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నా స్నేహితుడు జగన్‌కు అభినందనలు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించినందుకు శుభాకాంక్షలు.’ అని ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌ విజయం సాధించాలని దక్షిణ భారత దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.