విజయవాడ నుండి పోటీ చేస్తా: పీవీపీ

విజయవాడ నుండి పోటీ చేస్తా: పీవీపీ

పార్టీ ఆదేశిస్తే విజయవాడ నుండి పోటీ చేస్తా అని ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత పొట్లూరి‌ వరప్రసాద్ (పీవీపీ) అన్నారు. ఈ రోజు ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పీవీపీ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ పీవీపీకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

పొట్లూరి‌ వరప్రసాద్ మాట్లాడుతూ... జగన్ ఒక విజన్ ఉన్న నాయకుడు. వైసీపీ సిద్ధాంతాలు నచ్చి నేను వైసీపీలో చేరా అని స్పష్టం చేశారు. నేను ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం ఇదే మొదటిసారి. నేను పుట్టి పెరిగిన ఊరు విజయవాడ కాబట్టి అభివృద్ధి చేయాలని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కుల రాజకీయాలు ఉన్న మాట వాస్తవమే.. అన్నింటినీ తిప్పికొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నా. పార్టీ ఆదేశిస్తే.. ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఖచ్చితంగా విజయవాడ నుండి పోటీ చేస్తా. త్వరలో మంచి రోజు చూసుకొని ఎన్నికల ప్రచారం మొదలుపెడతాన్నారు. వైసీపీలో ఉన్న క్యాడర్ ను అందరిని కలుపుకుని వెళ్తా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.  వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యం అని పీవీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.