నా కుమారుడిని 'డాక్టర్' చేస్తా

నా కుమారుడిని 'డాక్టర్' చేస్తా

నా కుమారుడిని డాక్టర్‌ను చేస్తానని భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. 1980 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థులు శుక్రవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో 'ఉస్‌మెకాస్ 80 మెగా రీయూనియన్' పేరిట కళాశాలలో వివిధ ప్రాజెక్టులను రూపొందించారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓఎంసీ సింథటిక్ టెన్నిస్ కోర్టును సానియా ప్రారంభించారు. అనంతరం కోర్టులో కాసేపు ఆడి అలరించారు. అనంతరం కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులు సానియాకు జ్ఞాపికను అందజేసి సన్మానించారు.

ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ..  ఉస్మానియా మెడికల్ కళాశాల అభివృద్ధికి 1980 బ్యాచ్ పూర్వ వైద్య విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయం. కళాశాలను మెరుగుపర్చే విధానాన్ని అవలంభించడం ఆనందంగా ఉందన్నారు. టెన్నిస్ క్రీడ ఎంతో కష్టమైంది. అందుకే నా కుమారుడిని డాక్టర్‌ను చేస్తాను. నేను క్రీడాకారిణి కాకుంటే డాక్టర్‌ను అయ్యుండేదానినని సానియా తెలిపారు.