ఎగ్జిట్ పోల్స్ ను నేను నమ్మనుః మమతా బెనర్జీ

ఎగ్జిట్ పోల్స్ ను నేను నమ్మనుః మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో బీజేపీ దీటుగా తలపడింది. మొత్తం 42 స్థానాలున్న బెంగాల్‌లో బీజేపీ 19-22, టీఎంసీ 19-23 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌ను తాను నమ్మను అని మమత ట్వీట్ చేశారు. ఈవీఎంలను మార్చి ఉంటారని, అవకతవకలకు పాల్పడి ఉంటారని ఆమె అన్నారు. అధికార పార్టీ ఆగడాలపై పోరాడేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా ఉండాలని మమత పిలుపునిచ్చారు.