లోకేష్ ఛాంబర్ నాకొద్దు..!

లోకేష్ ఛాంబర్ నాకొద్దు..!

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో కొత్త మంత్రులకు ఛాంబర్‌లు కేటాయించారు. దీంతో కొందరు మంత్రులు ఇప్పటికే తమ తమ ఛాంబర్లలో అడుగుపెట్టగా... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం తనకు కేటాయించిన ఛాంబర్ వద్దని తేల్చిచెప్పేశారు. గత ప్రభుత్వంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్‌కి చెందిన ఛాంబర్‌ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నియమితులైన పెద్దిరెడ్డికి కేటాయించారు అధికారులు. దీంతో తనకు లోకేష్ ఛాంబర్ వద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేవారు. తనకు అంత పెద్ద ఛాంబర్ అవసరంలేదని ఆయన అధికారులకు చెప్పారు. కాగా, గత ప్రభుత్వంలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో లోకేష్‌కు ఛాంబర్ ఉండగా.. అదే శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డికి లోకేష్ ఛాంబర్ ను కేటాయించిన అధికారులు. ఆయన దానిని తిరస్కరించడంతో ఆయనకు ఛాంబర్ ఎక్కడ కేటాయించాలన్న దానిపై దృష్టిపెట్టారు అధికారులు.