వేశ్య పాత్ర వద్దన్నారు.. నేనే ధైర్యం చేసి చేశా: నటి అభితా

వేశ్య పాత్ర వద్దన్నారు.. నేనే ధైర్యం చేసి చేశా: నటి అభితా

నటి అభితా వెంకట్ పలు వాణిజ్య ప్రకటనలలో నటించి సినిమా ఛాన్స్ అందుకుంది. ‘కేరాఫ్‌ కాదల్‌’ తొలి చిత్రంలోనే వేశ్యగా నటించే అవకాశాన్ని అందుకుంది. కాగా అభితా తనకు దక్కిన మొదటి పాత్రే బోల్డ్ గా రావటం పట్ల ఆ సంఘటనలను గుర్తుచేస్తూ చెప్పుకొచ్చింది. ఆమెకు ఇదే తొలి చిత్రం కావడంతో కాస్త మంచి పాత్ర చేయమని ఆమె సన్నిహితులు, స్నేహితులు ఆమెను కోరారట. చాలా రోజులు అవకాశాల కోసం ఎదురుచూసిన తనకు ఈ పాత్ర చెయ్యటం పెద్దగా కష్టం అనిపించలేదట. కొన్నేళ్ళుగా వివిధ రకాల ప్రకటనల్లో నటిస్తూ వస్తున్నాను. సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్నప్పటికీ, ఎవరిని సంప్రదించాలో తెలియదు. అలా కొన్నేళ్ళు గడిచి పోయాయి. అలాంటి టైమ్ లో ‘కేరాఫ్‌ కాదల్‌’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.. వేశ్య పాత్ర అయిన.. ధైర్యం చేసి చేశాను అంటూ పేర్కొంది. ఈ సినిమాలో అభితా వెంకట్ కు ప్రశంసలు లభించాయి. వద్దన్న ఫ్రెండ్స్ సైతం ‘కేరాఫ్‌ కాదల్‌’ సినిమాను అభినందించారని అభితా చెప్పుకొచ్చింది. తన డేరింగ్ పాత్రతోనే ప్రస్తుతం మరిన్ని అవకాశాలు వస్తున్నాయంటూ తెలిపింది.