'రేప్ అంటే ఏంటి నాన్నా' అని అడుగుతారేమో?

'రేప్ అంటే ఏంటి నాన్నా' అని అడుగుతారేమో?

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ అబిప్రాయాలను అభిమానులతో పంచుకునే క్రికెటర్లలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా ఉంటాడు. గంబీర్ సామాజిక అంశాలపై తరచూ సోషల్ మీడియా వేదికగా స్పందింస్తుంటాడు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే ఇద్దరు అమ్మాయిలకు తండ్రిని అయినందుకు మాత్రం చాలా సంతోషం అని తెలిపాడు.

చిన్న పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారనే వార్తలు రోజు దినపత్రికల్లోని మొదటి పేజీల్లో వస్తుండటం బాధాకరమైన విషయం. తొందరలో తన కూతుళ్లు కూడా 'రేప్ అంటే ఏమిటి నాన్నా' అని అడుగుతారేమోనని భయంగా ఉందని తెలిపాడు. ప్లే స్కూళ్లలో మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి చిన్న పిల్లలకు చెప్పాల్సిన అవసరం రావడం దారుణమని అన్నాడు. నిజాయితీగా చెపుతున్నా.. నా భార్య-నేను మంచి, చెడు స్పర్శల గురించి మా కుమార్తెలకు చెప్పలేదు. ఇప్పుడు నా పెద్ద కూతురి దృష్టంతా ఆడుకోవడంపైనే ఉందన్నాడు. స్కూల్ రోజుల్లో అమ్మాయిలు రాఖీ కడితే ఆనందించేవాడిని.. ఇప్పుడు అలాంటి బంధాలు కనపడట్లేదు అని గంభీర్ పేర్కొన్నాడు. 

Photo: FileShot