భయపడితే ఇంట్లో తలుపులేసుకొని కూర్చొనేదానిని

భయపడితే ఇంట్లో తలుపులేసుకొని కూర్చొనేదానిని

ఓటమి భయంతోనే వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడం లేదనే విమర్శను కొట్టిపారేశారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, తూర్పు యుపి ఇన్ ఛార్జి ప్రియాంక గాంధీ వాద్రా. ఇండియా టుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తానెప్పుడూ ఓడిపోతానని భయపడలేదని స్పష్టం చేశారు. 'నేను పోరాడుతున్నాను. నేను నిర్విరామంగా అన్ని సీట్లలో ప్రచారం చేస్తున్నాను. ఎన్నికల్లో పోటీ చేసే విషయానికొస్తే ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలను సలహా అడిగాను. వారంతా నేను ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే నేను వారణాసికే పరిమితం కావాల్సి వస్తుందని సూచించారు' అని తెలిపారు. 

గత లోక్ సభ ఎన్నికల్లో రికార్డు మార్జిన్ తో విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేసి ఓడిపోతానేమోనని భయపడ్డారా అన్న ప్రశ్నకు ప్రియాంక వాద్రా పగలబడి నవ్వారు. 'ప్రియాంక గాంధీ ఓటమి అంటే భయపడిననాడు ఆమె ఓ గదిలో తాళం వేసుకు కూర్చుంటుంది. నేనెప్పుడూ ఓటమి అంటే భయపడలేదని' ఆమె చెప్పారు.